Somasila Project Water Release : సోమశిలనుంచి భారీగా వరదనీరు విడుదల

రెండు మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల ప్రాజెక్ట్.. నిండుకుండలా మారింది. 19వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా నమోదవుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం 3 క్రస్ట్ గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో పెన్నాకు పూర్తి స్థాయిలో జలకళ వచ్చింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola