Tirupati Floods: తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ గ్రామస్తుల ఆందోళన

Continues below advertisement

తిరుపతి రూరల్ మండలం, పాతకాల్వ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు.. పేరూరు చేరువు అధికారులు గండికొట్టి పాతకాల్వ, సి.గొల్లపల్లి, రామానుజంకాలనీ వైపుగా స్వర్ణముఖి నది వైపుగా వరద నీటిని పంపే ప్రయత్నం చేశారు.. దీంతో పాతకాల్వ గ్రామంలోకి వరద నీరు వచ్చిందని హైవేపై నిన్న అర్ధరాత్రి ధర్నాకు దిగారు.. దీంతో రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేసిన ఘటనలో ఓ మహిళతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. సంఘటన స్ధలంకు చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామం వైపు వరద నీరు మళ్ళించంమని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.. కానీ అధికారులు,ప్రజాప్రతినిధులు మాత్రం తమ గ్రామం వైపు వరద నీరు పంపించి గ్రామం మునిగే విధంగా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. నిన్న అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి వరద నీరు రావడంతో ఇళ్ళల్లోని వంట సామగ్రి అన్ని తడిచి పోవడంతో రాత్రి అంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిండి తిప్పలు లేకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంటకు, పేరూరు కి వరద నీరు వెళ్ళకుండా మా గ్రామాలపై వచ్చేలా చేశారని గ్రామస్తులు వాపోతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram