NTR Health University: ఎన్టీఆర్ వర్సిటీలో నిధుల మళ్లింపు... ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధుల మళ్లింపుపై వివాదం ముదురుతోంది. నిధుల మళ్లింపుపై ఉద్యోగులు అభ్యంతరం తెలుపుతున్నారు. సోమవారం వర్సిటీ నిధులు ప్రభుత్వ ఖజానాకు బదలాయించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు తెలియకుండా ఈ బదలాయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వర్సిటీ నిధులు రూ. 400 కోట్లను స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అధికారులు మళ్లించారు. ఈ విషయంపై అధికారులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. దీంతో విధులకు హాజరు కాబోమని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు