Nellore: నెల్లూరులో శాంతించని వాగులు..కలచివేస్తున్న వరద దృశ్యాలు

Continues below advertisement

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. అయితే జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియక కొంతమంది భక్తులు వివిధ ప్రాంతాలకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుండి కొంతమంది భక్తులు ఏఎస్ పేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దర్గాను సందర్శించడానికి వచ్చారు. అయితే ఏఎస్ పేటకు రావాలంటే మధ్యలో ఓ వాగు అడ్డంగా ఉంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే బస్సుల్ని అక్కడే ఆపి ట్రాక్టర్ల ద్వారా భక్తుల్ని చప్టాపైనుంచి దాటిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన తల్లీ కూతుళ్లు వాగు ప్రవాహంలోకొట్టుకుపోయారు. అయితే స్థానికుల సాహసం వారిని ప్రాణాలతో కాపాడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram