Kurnool: పది రూపాయలకే రుచికరమైన టిఫిన్

గ్యాస్, నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో కూడా కేవలం పది రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు ఓ హోటల్ నిర్వహకులు. పది రూపాయలకే రుచికరమైన ఇడ్లీ, వడ, దోశ, పూరీ, ఉగ్గాని అందిస్తున్నారు. పది రూపాయలకు టీ దొరకడమే కష్టంగా ఉంటే ఈ హోటళ్లో మాత్రం టెన్ రూపీస్ కే టేస్టీ టిఫిన్ ఇస్తున్నారు. ఇక్కడ టిఫిన్ రుచికరంగా ఉండటంతో జనం క్యూ కడుతున్నారు. పదేళ్ల నుంచి పది రూపాయలకే టిఫిన్ అందిస్తున్న హోటల్ యజమానికి  ఇటీవల  ఓ సంస్థ అవార్డుతో సత్కరించింది. ప్రజలకు రుచికరమైన అల్పాహారం అందిచాలన్న సంకల్పంతో కర్నూలులోని రోజావీధిలో రేణుక దేవీ టిఫిన్ సెంటర్ ను నాగేశ్వర రెడ్డి, అతని మామ ప్రారంభించారు. అయితే కొద్ది రోజులకు నాగేశ్వర రెడ్డి మామ వేరే బిజినెస్ కు వెళ్లడంతో హోటల్ బాధ్యతలన్నీ నాగేశ్వరరెడ్డి చూసుకుంటున్నారు. ప్లేట్ ఇడ్లీ, వడ, దోశ, పూరీ, మైసూర్ బొండా, ఉగ్గాని పది రూపాయలకే అందించాలని నాగేశ్వరరెడ్డి నిర్ణయించారు. ఉగ్గానితో పాటు బజ్జీ కావాలంటే మరో ఐదు రూపాయలు అదనం. గ్యాస్, నూనె, కూరగాయల ధరలు పెరిగినా పది రూపాయలకే టిఫిన్ అందించడం ఈ హోటల్ విశేషం. హోటల్ వ్యాపారంలో ఆర్థికంగా ఎన్ని ఆటు పోట్లు  ఎదురైనప్పటికీ తక్కువ రేటుకు మంచి రుచికరమైన అల్పాహారం అందిస్తున్నందుకు ఏపీ క్యూర్స్ హాస్పిటాలిటీ సంస్థ నాగేశ్వరరెడ్డికి ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డుతో సత్కరించింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola