Chittoor : మద్యం తాగి నీళ్లలో దిగి పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు
Continues below advertisement
హైదరాబాద్ లో జూ లో ఒక యువకుడు సింహం దగ్గర హల్చల్ చేస్తే ,చిత్తూరు జిల్లాలోని నగరి కుశస్థలి నది ప్రవాహంలోకి దిగిన ఓ యువకుడు పోలీసులకు చుక్కలు చూపెట్టాడు.నది నీటిలో చిక్కుకొన్న వ్యక్తిని కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తుంటే వారిని ముప్పు తిప్పలు పెట్టాడు యువకుడు.. బాధితుడు నగిరి టౌన్ లో చికెన్ షాప్ లో పని చేసే వ్యక్తిగా గుర్తించారు.. వరద నీటిలో ఉన్న వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. చివరికి బాధితుడిని కాపాడారు.
Continues below advertisement