Mla Prasanna Kumar Reddy: చంద్రబాబుపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శకు వచ్చిన జగన్ ని స్థానికులు ఆప్యాయంగా పలకరించారని, ఆయనతో సెల్ఫీలు దిగారని, ఆయన దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపించారని, అవేవీ చంద్రబాబుకి నచ్చలేదని అన్నారు ప్రసన్న. జగన్ ని ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తే చంద్రబాబుకి వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు దగ్గరకు ఎవరూ రావాలనుకోరన్నారు.