Akhanda: విశాఖ జిల్లా నర్సీపట్నం బంగార్రాజు థియేటర్ లో షాకైన బాలయ్య అభిమానులు
Continues below advertisement
అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన థియేటర్లలో మాస్ జాతర సృష్టిస్తోంది. బాలయ్య మాస్ అప్పీల్ సృష్టించిన సునామీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ వింత ఘటన ఎదురైంది బాలకృష్ణ అభిమానులకు. అఖండ సినిమాలో బాలయ్య అఘోరాగా నటించిన సంగతి తెలిసిందే. అయితే అఘోరాగా చేసిన బాలయ్యను చూసేందుకు నిజంగా అఘోరాలు బంగార్రాజు థియేటర్ కు వచ్చారు. సాధారణ ప్రేక్షకుల్లానే ఆద్యంతం సినిమా చూసి శివనామం జపం చేస్తూ వెళ్లిపోయారు. వెళ్లే ముందు బాలయ్య అభిమానులతో కాసేపు మాట్లాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Continues below advertisement