Kadapa: కడప జిల్లాలో వర్షాలు... అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్
కడప జిల్లా, వరద నేపథ్యంలో తీసుకుంటున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ విజయరామ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. జిల్లాలో నవంబర్ నెలలో సాధారణం కంటే అత్యదిక స్థాయిలో వర్షపాతం నమోదైందన్నారు.10 ఏళ్ల తరవాత ఇంతమేర వర్షపాతం వచ్చిందని, జిల్లాలో భారీ వర్షాల కారణంగా 1721 కోట్ల రూపాయలు జిల్లాలో నష్టం జరిగిందని చెప్పారు.