Srikakulam Farmers: తుపాన్లతో విలవిల్లాడుతున్న శ్రీకాకుళం రైతుల కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్
వరుస తుపాన్లతో అన్నదాత విలవిలలాడుతున్నాడు. నాలుగైదు రోజులకో తుపాను రావడంతో రైతు లు తీవ్ర నష్టాలకు గురికాక తప్పడంలేదు. దేశానికి వెన్నెముక అయిన రైతు నేడు కష్టాల్లో కుంగిపోతున్నాడు. రైతు ఈ వరి మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ ఖరీఫ్ అంతా తుపాను లు, అల్పపీడనాలతో పూర్తిగా చేలు పాడైపోయాయి. కోసిన పంట ఇప్పటికీ ముంపులోనే ఉండిపోగా, ధాన్యం గింజలు మొలకెత్తుతు న్నాయి. కొన్నిచోట్ల ధాన్యం రంగు మారిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయామని రైతులు కంటతడి పెడుతున్నారు. కనీసం 10 శాతం పంట చేతికొస్తుందన్న నమ్మకం లేదంటున్నారు. కోసిన చేలు ఆరాలి, కుప్పలుగా వేయాలి కానీ ప్రకృతి అంత సమయం రైతులకు ఇవ్వకపోవడంతో రైతుల పాట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. పూర్తిగా పండిన పంటచేలు కోయడానికి అవకాశం లేకపోవడంతో పొలాల్లోనే చేల నుంచి గింజలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదుకో పోతే ఆత్మహత్యే శరణ్యం అంటున్నా రైతులతో మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.