Kuppam: కుప్పంలో టెన్షన్... లోకేశ్ ప్రచారంలో వైసీపీ కార్యకర్తల డ్యాన్స్
Continues below advertisement
చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేశ్ ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం రథం ఎదురైంది. దీంతో వైసీపీ నేతలు ప్రచార రథం సౌండ్ పెంచి చిందులేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. కుప్పంలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కుప్పం మున్సిపాలిటీ మూడో వార్డులో నారా లోకేశ్ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
Continues below advertisement