AP Aided Institutions: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి నాలుగు ఆఫ్షన్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యాసంస్థ విలీనం వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలీన అంశాన్ని విద్యాసంస్థలకే వదిలిపెడుతూ నాలుగు ఆఫ్షన్లతో మార్గదర్శకాలు జారీచేసింది. ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. విద్యాసంస్థల ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు వెసులుబాటు కల్పించింది. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఓ మెమో జారీ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనానికి ఇప్పటికే మూడు ఐచ్ఛికాలు ఇవ్వగా తాజాగా అంగీకారాన్ని వెనక్కి తీసుకునే ఆఫ్షన్ అందులో చేర్చింది. పాఠశాల, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు ఈ మెమో జారీ చేశారు.