Chittoor: స్వర్ణముఖి వరదలో చిక్కుకున్న దంపతులు.. కాపాడిన ఫైర్ సిబ్బంది
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం స్వర్ణముఖి నదితీరంలో వరద దాటికి దంపతులు చిక్కుకున్నారు. గురువారం రాత్రి నుంచి ఆకలితో అలమటిస్తున్న సంవత్సరం బిడ్డతో దంపతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తీరందాటి ఇంటి వైపు వచ్చేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి. వారిని కాపాడేందుకు తిరుచానూరు పోలీసులు రంగంలోకి దిగారు. చిగురువాడ వద్ద స్వర్ణముఖి నదీ తీరానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఫైర్ ఇంజన్ మధ్యలోనే నిలిచిపోయింది. అనంతరం నదిలో తాళ్లు కట్టి దంపతులను రక్షించారు.