Secret Fund: కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు..
కర్నూలు జిల్లాలో గుప్తనిధుల వేటగాళ్లు హల్ చల్ చేశారు. కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గుంటి రంగస్వామి ఆలయం వద్ద ఉన్న రాతి దూలాలను పెకిలించి మరీ ధ్వంసం చేశారు.