Vizag Fishing Harbour: కంటైనర్ యార్డులో ఉద్యోగాల హామీపై మత్స్యకారుల ఆందోళన
విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఆందోళన చేపట్టారు.... కొంతమంది మత్స్యకారులు. కంటైనర్ యార్డులో ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఇప్పటిదాకా నెరవేర్చలేదంటూ వారంతా ఆందోళనకు దిగారు. కంటైనర్ యార్డులోకి లారీలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎందుకంటే మొత్తం టెర్మినల్ నే దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నిస్తున్నారు. షిప్పులు వచ్చే మార్గంలో బోట్లు అడ్డుపెట్టి మరీ తమ నిరసన తెలియచేస్తున్నారు.