Vizag Byjus Fire Accident: రెండో అంతస్తులో మొదలై, మూడో అంతస్తుకు పాకిన మంటలు
Continues below advertisement
విశాఖ బైజూస్ లో అగ్నిప్రమాదం జరిగింది. గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో ఈ ఘటన జరిగింది. మెయిన్ రోడ్డులో వైభవ్ జ్యువెలరీ షాపు రెండో అంతస్తులో ఉన్న బైజుస్ లో మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలు ఆర్పే ప్రక్రియ మొదలుపెట్టారు. కాసేపటికే మంటలు రెండో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు పాకాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా లేక వేరే ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు వెల్లడించారు. అయితే భారీగా ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం వివరిస్తోంది.
Continues below advertisement