నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
ఇదొక చక్కని పల్లెటూరు. చుట్టూ కొండలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గ్రామం. అన్ని రకాల వసతులతో బ్రహ్మాండమైన పంటలు పండే భూములు ఉన్న గ్రామం అది. కానీ కొన్నేళ్లుగా ఆ గ్రామం కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే దెయ్యం దెబ్బ. దాని కారణంగా అక్కడ ఇళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఖాళీ అయిన ఆ గ్రామంలో ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయా? సీతాపురం అనే గ్రామానికి కాలినడకన ఏబీపీ దేశం చేరుకుంది. ఒక వ్యక్తి దారి చూపించేందుకు వెంట వచ్చాడు. దెయ్యం ఉందని ఎక్కడైతే ప్రచారం జరిగిందో అదే ఈ ప్రాంతమని ఆ వ్యక్తి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయితీలోని అక్కువరం సీతాపురం గ్రామం ఓప్రత్యేకమైంది. . సీతాపురం... ఈ గ్రామం పేరు వినటానికి ఎంత అందంగా ఉందో.... దాని గురించి తెలిస్తే మాత్రం అంతకు మించి టెర్రర్. అక్కువరం సీతాపురం గ్రామo వెళ్ళటానికి దారి ఎటు అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎవరైనా అడిగితే చాలు వారంతా గజగజ వణికి పోతారు.