Janasena Leaders Released: ఎయిర్ పోర్ట్ ఘటనలో అరెస్టైన జనసేన నాయకులు విడుదల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ ఘటనలో అరెస్టైన 9 మంది జనసేన నాయకులు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే వాళ్లు ప్రతి రోజూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరవాలని లీగల్ సెల్ న్యాయవాదులు తెలిపారు. పవన్ విశాఖ పర్యటనకు అన్ని అనుమతులూ తీసుకున్నామని జనసేన నాయకులు అన్నారు.