Pushpa Srivani Dance: ఆదివాసీ సంబరంలో అదిరేటి స్టెప్పులేసిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Continues below advertisement

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్టెప్పులేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. వేదికపై విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించారు. వేదికపైకి ఎక్కిన పుష్ప శ్రీవాణి వారితో కలిసి థింసా నృత్యం చేశారు. ఏకంగా ఉపముఖ్యమంత్రే స్టెప్పులేయడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పుకొట్టి అందర్ని ఉత్సాహపరిచారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram