Viral Video: అప్పుడు మీకు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చాం.. ఇప్పుడు పట్టించుకోండి.. మంత్రి కుమారుడి ముందే కానిస్టేబుల్ ఆవేదన..

Continues below advertisement

అప్పుడు మీ గెలుపు కోసం పోస్టల్ బ్యాలెట్లు తీసుకొచ్చి ఇచ్చాం... ఆ కష్టాన్ని ఇప్పుడు గుర్తించండి అంటు ఓ కానిస్టేబుల్... మంత్రి కుమారుడి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో హెడ్ కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో  కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని సుమారు 700 పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ఓ రాజకీయ పార్టీకి అందించామని స్పెషల్ బ్రాంచ్‌ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కానిస్టేబుల్ కోరిన వీడియో హాల్‌చల్‌ చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో జులై 30న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఓ సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram