Anakapalli Volunteers Fake Certificates: వాలంటీర్ల బాగోతం ఎలా బయటపడింది..?

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు.... అనకాపల్లిలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అడ్డదారులు తొక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమే కాని డిజిటల్ అసిస్టెంట్ సుధీర్ కు పెళ్లైనట్టు నకిలీ ధ్రువపత్రం సృష్టించారు. పెళ్లయినా సరే భర్తలతో విడిపోయినట్టు మహిళా పోలీసులు రాజేశ్వరి, వెంకటలక్ష్మి పత్రాలు సృష్టించుకున్నారు. వీరికి ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ సహకరించారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. ముగ్గురు సచివాల ఉద్యోగులు, వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola