Vijayawada Tension UTF Leaders Arrested: యూటీఎఫ్ నాయకుల అరెస్ట్ తో విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇవాళ,రేపు విజయవాడలో 36 గంటల ధర్నాకు పిలుపునిచ్చిన యూటీఎఫ్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.తమకు జీతాలు సమయానికి ఇవ్వాలని, పీఆర్సీ,డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నాయకుల ప్రధాన డిమాండ్లు. తమ జీతాల్లో నుంచి దాచుకునే గ్రాట్యూటీ, జీపీఎఫ్ లాంటివాటిని కూడా ప్రభుత్వమే వాడేస్తోందని,వాటిని వెంటనే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తూ 36 గంటల ధర్నాకు పిలుపునిచ్చారు.