విజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

Vijayawada Ganj Batch Conflict CCTV Video: విజయవాడ నగరంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. అజిత్ సింగ్ నగర్ రూప లక్ష్మి సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పొట్టకూటికోసం పాన్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే మాజీ వాలంటీర్‌పై మత్తులో ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. అతను ఫూటుగా తాగి, గంజాయి సేవించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కృష్ణ హోటల్ సెంటర్ ప్రాంతానికి చెందిన అతను బార్ లో మద్యం సేవించి బయటికి వచ్చి సిగరెట్ ఇవ్వమని విజయ్ కుమార్ ని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే నన్నే డబ్బులు అడుగుతావా అంటూ చొక్కా పట్టుకొని షాపులోంచి బయటికి ఈడ్చుకువచ్చి అతను దాడి చేశాడు. పోలీసులు నన్నేం చేయలేరు అంటూ మాజీ వాలంటీర్ పై పిడిగుద్దులతో దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ కు దగ్గర్లోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.                

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola