
Vijaya Sai Reddy Counters YS Jagan | నేను ఎవడికీ అమ్ముడుపోలేదు | ABP Desam
వైసీపీ అధినేత జగన్ కు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తొలిసారిగా కౌంటర్ ఇచ్చారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి వైసీపీని వదిలివెళ్లిపోవటంపై మీడియా నుంచి జగన్ కు ప్రశ్న ఎదురైంది. దీని పై జగన్ ఏం మాట్లాడారో ముందోసారి చూద్దాం. రాజకీయాల్లో ఉండేవారికి క్యారెక్టర్ ఉండాలని...ప్రలోభాలకు లొంగిపోయి...కేసులకు భయపడిపోయి వెళ్లిపోయే వాళ్లు లీడర్లు కారంటూ జగన్ వేసిన పంచులపై విజయసాయిరెడ్డి తొలిసారిగా స్పందించారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగనేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పైగా రాజ్యసభ సభ్యత్వాన్ని, పదవులను వదులుకున్నాంటూ జగన్ అన్న మాటలకు ఘాటుగానే రిప్లై ఇచ్చారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ ను టార్గెట్ చేస్తూ విజసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన ఈ ట్వీట్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టేసిందే కాకుండా ఇలా మాట్లాడటం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.