Amma Rajasekhar Tasting Food in Anna Canteen | ఆంధ్రా వాళ్లు అదృష్టవంతులు | ABP Desam
డైరెక్టర్, కొరియాగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ అన్న క్యాంటీన్ ఫుడ్ ను టేస్ట్ చేశారు. తన కుమారుడు రాగిణీరాజ్ హీరోగా తల అనే సినిమా తీసిన అమ్మ రాజశేఖర్ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖ పట్నం వెళ్లారు. అక్కడ రామాటాకీస్ సర్కిల్ దగ్గరున్న అన్న క్యాంటీన్ లోకి వెళ్లి భోజనం చేశారు. అమ్మ రాజశేఖర్ తో పాటు ఆయన కుమారుడు రాగిణీ రాజ్, కమెడియన్ ముక్కు అవినాష్ ఉన్నారు. ఐదు రూపాయలకే ఇంత క్వాలిటీ భోజనం పెట్టడం చాలా బాగుందన్న అమ్మ రాజశేఖర్..ఆంధ్రా భోజనం తినాలని ఎప్పటి నుంచో చూస్తున్నానని ఐదు రూపాయలకే ఇంత క్వాలిటీ భోజనం దొరకటం అంటే ఆంధ్రా ప్రజలు అదృష్టవంతులని అక్కడి స్టాఫ్ ను అభినందించారు. తన కుమారుడి చిత్రం తలాను ఆదరించాలని కొత్తవాళ్లతో తీసిన సినిమాను ఆదరిస్తే ఇండస్ట్రీలోకి యువరక్తం వస్తుందన్నారు అమ్మ రాజశేఖర్. తన రణం సినిమా గురించి గోపీచంద్ యాక్షన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారని గుర్తు చేసుకున్నారు అమ్మ రాజశేఖర్.