Nara Rohit : చంద్రబాబు తల్లితండ్రుల సమాధులవద్ద నారారోహిత్ నిరసన

వరద ప్రభావిత ప్రాంతాల్లో సినీనటుడు నారా రోహిత్ పర్యటించారు.. భారీ వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో పాలు, పండ్లను భాధితులకు నారా రోహిత్ అందజేశారు.. అంతక‌ ముందు నారావారిపల్లెలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా ఖర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు.. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి కొద్ది సేపు బైఠాయించారు.

తమ పెదనాన్న చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచిందన్నారు.. అన్న ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని, ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో చేసుకోలేదని,గడప దాటలేదని, సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదిని కొనియాడారు.. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola