CJI NV Ramana: పుట్టపర్తికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టపర్తికి చేరుకున్నారు. సోమవారం సత్యసాయి విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. సీజేఐ పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.