
Veera Raghava Reddy గురించి గ్రామ సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు | Chilkur balaji temple | ABP Desam
చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి అలియాస్ రామరాజ్యం వీరరాఘవ రెడ్డి గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది.. రామరాజ్య స్థాపనకు అవసరమైతే ప్రాణాలివ్వడం, ప్రాణాలు తీయడం అనే నినాదంతో రామరాజ్యాన్ని స్థాపించినట్లు చెప్పుకుంటున్న వీరరాఘవ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పలు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఇంతకీ వీరరాఘవ రెడ్డిది అసలు ఏఊరు.. ఆయన స్వస్థలం ఎక్కడ అనే చర్చ జరుగుతుండగా వీరరాఘవరెడ్డి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం కొప్పవరం గ్రామం.. ఈ గ్రామంలో వీరరాఘవరెడ్డి చాలా కాలంగా ఉండడం లేదని, అయితే ఆయన తల్లితండ్రులు ప్రస్తుతం నూజివీడులోని ఆయన సోదరుడి ఇంటివద్ద ఉంటున్నారని స్థానికులు తెలిపారు. గ్రామంలో ఎవ్వరిని కదిపినా వీరాఘవరెడ్డి మంచివాడనే చెప్పడం గమనార్హం. వీరరాఘవరెడ్డి గురించి ఆయన స్వగ్రామం కొప్పవరంలో గ్రామస్తులు ఏం చెబుతున్నారు అనే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం.. కొప్పవరం గ్రామం నుంచి ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్..