
Kiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM
క్రిప్టో కరెన్సీ విషయంలో మీడియాను ఏ విధంగా కిరణ్ రాయల్ మేనేజ్ చేస్తాడో తెలిసిందని ఆరోపించారు లక్ష్మీ. జైపూర్ నుంచి బెయిల్ పై విడుదలై వచ్చిన ఆమె జనసేన నేత కిరణ్ రాయల్ పై మళ్లీ ఆరోపణలు చేశారు. తనను జైపూర్ తీసుకువెళ్లటానికి ఫ్లైట్ టికెట్స్ ఎవరు బుక్ చేశారని.. 41 c నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేశారు అని జడ్జి ప్రశ్నించారని చెప్పుకొచ్చారు లక్ష్మీ.ప్రవేట్ వాహనంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ను తీసుకు వచ్చారని చెప్పానని అయితే పోలీస్ పాస్ పోర్ట్ లేకుండా అనధికారికంగా వెళ్లారంటూ జడ్జి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు లక్ష్మీ.చెన్నై ఎయిర్ పోర్ట్ లో తనతో పాటు వేరేవాళ్లను అనుమతి వెళ్లేందుకు జడ్జి అనుమతి ఇస్తే, తీసుకు వెళ్లకుండా ఆపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు లేదన్న లక్ష్మీ తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నాని చెప్పారు. "వేంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా , ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు కిరణ్ రాయల్ కిలాడి లేడీ అని నాపై ఆరోపణలు చేశాడు కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు..అమ్మాయిలను మోసం చేసి సంపాదించాడు" అంటూ లక్ష్మి కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేశారు.