Variety Idea from Guntur Farmer: పక్షుల బెడద తప్పించుకునేందుకు ఇలా చేశారు| ABP Desam
Guntur జిల్లా నకరికల్లు మండలం Kandlagunta గ్రామానికి చెందిన రైతు రావిపాటి సుందరయ్య... తన పొలాన్ని కాపాడుకునేందుకు కొత్తగా ఆలోచించారు. Rabi వరినాట్ల సమయానికి కొంగలు, వివిధ రకాల పక్షుల బెడదతో నష్టం వాటిల్లుతోందని గుర్తించారు. దీంతొ ఓ ఐడియాను అమలు పర్చారు. వరి చేల వద్ద మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. అందులో సినిమా పాటలు, మనుషుల మాటల రికార్డింగ్స్ ప్లే చేస్తున్నారు. ఆ శబ్దాలకు పక్షులు వాలడం లేదని రైతులు సంతోషిస్తున్నారు. హ్యాండ్ మైక్ సెట్లకు 600 రూపాయలు మాత్రమే అయినట్టు చెబుతున్నారు.