వంగవీటి రాధా హత్య కు కుట్ర పై రాజకీయపార్టీల దృష్టి..
తనను హతమార్చేందుకు రెక్కి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ చేసిన కామెంట్స్ పై పొలిటికల్ హీట్ మెదలైంది..అటు టీడీపీ,ఇటు జనసేన నాయకులు రాదాకు అండగా నిలబుడతున్నారు.పవన్ కళ్యాణ్,చంద్రబాబు రాదాతో ఫోన్ లో మాట్లాడారు.పరిస్దితులు పై ఆరా తీశారు.రాధా కూడ తన దృష్టికి వచ్చిన విషయాలు ఇరువురు నేతలకు వివరించారు.గన్ మెన్ లను తిరస్కరించిన విషయం కూడ చర్చకు వచ్చింది.ప్రాణాలను కాపాడుకునేందుకు కూడ కష్టపడాల్సి వస్తుందని ఈ సందర్బంగా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.రాధా ఎపిసోడ్ పై డీజీపీకి లేఖ వ్రాశారు.