Udayagiri Ycp Internal Clashes : ఉదయగిరిలో జగన్ ఫ్లెక్సీలు చింపేసిన సొంతపార్టీ నేతలు | DNN
నెల్లూరు జిల్లాలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే. కానీ అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు గ్రూపులు తయారయ్యాయి. ఉదయగిరిలో అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను అదే పార్టీలోని మరో వర్గం చించేసింది. నిన్న వెంకటగిరి వైసీపీలో రచ్చ జరిగినట్టే, ఈరోజు ఉదయగిరి వైసీపీలో కూడా గొడవ మొదలైంది. దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో కొంతమంది వైసీపీ నాయకులు వేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.