Tulasi Reddy: ఏపీలో 20ఏళ్ళు మద్యపాన నిషేధం ఉండదు..!

Continues below advertisement

మద్యాన్ని ఓ ఆదాయ వనరుగా వైకాపా ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు తులసిరెడ్డి. 2020-21 సంవత్సరంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ఇరవై వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అయితే 2021-22 సంవత్సరం ఆదాయం ముప్పైవేల అయిదువందల ముప్పైఅయిదు కోట్ల కు పెంచిందన్నారు. ఇదిగాక అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ పేరుతో ఆడిషనల్ టాక్స్ విధించి, ఆ వచ్చిన డబ్బులను బ్యాంకులకు చూపించి ఇరవై వేల కోట్లు ప్రభుత్వం అప్పు తెచ్చిందని అన్నారు. అంటే దీని ద్వారా రాష్ట్రంలో ఇరవై సంవత్సరాల పాటు మద్యపాన నిషా పథకం కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని విమర్శించారు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram