TTD EO: టీటీడీలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం | ABP Desam
TTD లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ నియమించినట్టు ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.... ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నిపుణులు గుర్తించి వాటికి మరమ్మతులు చేపడుతున్నట్టు వివరించారు. త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జన్మస్థలంలో ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు భూమి పూజ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.