
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
షర్ట్ విప్పితే సిక్స్ ప్యాక్ ఉండటానికి ఆయనేమన్నా ఇంకా హీరోనా..? క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో ఉంటూ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే వాళ్లపైనా ట్రోలింగ్ తప్పదా..?
సనాతన ధర్మాన్ని పాటించటం తప్పా...లేదా పొట్ట ఉండటం తప్పా..? దేనికి విపరీతమైన పోకడా...సోషల్ మీడియా చేతిలో ఉందనే మిడిసిపాటా...ఇప్పుడు సగటు జనసైనికుల ప్రశ్నలు ఇవే.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహా కుంభమేళాకు వెళ్లారు. పుట్టుకతో క్రిస్టియన్ అయినా రష్యాలో పెరిగినా హిందూ ధర్మాన్ని, తన అభిప్రాయాలను గౌరవించే భార్య అనా కొణిదెలతో, తన కుమారుడు అకీరాతో, స్నేహితుడు, డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరీ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. గంగామాతకు హారతులను ఇచ్చారు. ఇక్కడవరకూ బాగానే ఉంది స్నానం చేయటం కోసం పవన్ కళ్యాణ్ షర్ట్ విప్పారు. అంతే ఇంక ట్రోలింగ్. ఆ పొట్టేసుకుని ఇన్నాళ్లూ బెదిరిస్తున్నావా అంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ బ్యాచ్ అంతా పవన్ ను టార్గెట్ చేసి ఇదుగో ఇన్ని పోస్టులు పెడుతున్నారు. విపరీతమైన ట్రోలింగ్. బాడీ షేమింగ్.వాళ్లకు జనసైనికులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.