Kakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP Desam

కళలు, చేతిపనులు, సంస్కృతి, సంప్రదాయాల కళా వేదికగా నిర్మితమైన శిల్పారామంలో పిల్లల ఆటస్థలం చేతిపనుల స్టాల్స్‌, ఆకర్ణణీయమైన కుడ్యచిత్రాలు, మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు వాటిపై రంగవల్లులు చూడచక్కగా ఉంటాయి .. ఇక వాక్‌వేకు ఆనుకుని ఏర్పాటు చేసిన రాతిశిల్పాలు, నిర్మాణాల గోడలపై చూడచక్కని పెయింటింగ్‌లు ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి..  ఏపీ శిల్పారామం ఆర్ట్ప్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న ఈ శిల్పారామం ఆశించిన స్థాయిలో అయితే అభివృద్ధి కాలేదనే చెప్పాలి.. కాకినాడ బీచ్‌ను ఆనుకుని ఉన్న ఈ శిల్పారామం 2013లో నిర్మాణానికి అడుగులు పడినా 2016లో అభివృద్ధికి నోచుకుంది.. ఆతరువాత 2017 డిసెంబర్‌ నెలలో కాకినాడ తీరంలోనే నిర్వహించిన బీచ్‌ ఫెస్టివల్‌ను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈకార్యక్రమానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరితో బీచ్‌పార్కుతోపాటు శిల్పారామం ప్రజలకు గుర్తిండిపోయింది.. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధి పరంగా ఎటువంటి అడుగులు పడకపోవడం సందర్శకులను నిరాసకు గురిచేస్తోంది.. ప్రస్తుతం శిల్పారామంను సందర్శించేందుకు సందర్శకులకు టిక్కెట్టు ప్రాతిపదికన అదేవిధంగా ఫోటోషూట్‌లకు నిర్ణీత రేటు పెట్టి అనుమతులు ఇస్తుండడంతో ఫ్రీవెడ్డింగ్‌, బర్త్‌డే షూట్‌ల కోసం వరుస కడుతున్నారు.. పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన లకేషన్లు ఉండడంతో రోజులో పదుల సంఖ్యలో నూతన వధూవరులు, పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కోసం ప్రీషూట్‌ల కోసం చాలా మంది ఇక్కడికి విచ్చేస్తుండడం కనిపిస్తుంటుంది.. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ శిల్పారామంలో ఆహ్లాదంకోసం గడిపేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.. ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు కుటుంబ సమేతంగా గడిపేందుకు చాలా మంది విచ్చేస్తుంటారని ఇక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola