ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలో పాల్గొనటం లేదు
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవుల కోసమే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలైన బొప్పరాజు, బండి శ్రీనివాసులు ఉద్యమ బాట పట్టారంటూ ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ ఆరోపించారు. ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ట్రెజరీ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదని స్పష్టం చేసిన ఆయన సీఎంపై ఎంతో నమ్మకం తో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. గడువు సమయంలోపు పీఆర్సీ పై ప్రకటన రాకపోతే తదుపరి కార్యచరణను ప్రకటిస్తామన్నారు. చంద్రశేఖర రెడ్డి ఉగ్యోగుల తరపున వారధిగా ఉన్నా ఉపయోగం లేనప్పుడు ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడం మంచిదని హితవు పలికారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ ఇద్దరూ బంధువులేనని, బొప్పరాజుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలని , బండి శ్రీనివాస్ రజక కార్పొరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై వీరిద్దరూ ఒత్తిడి తెస్తోంది అందు కోసం కాదా అని రవికుమార్ ప్రశ్నించారు.