Tomato Theft: కృష్ణాజిల్లాలో చర్చనీయాంశంగా మారిన టమోటాల దొంగతనం కేసు
కృష్ణా జిల్లా లో టమోటాల దొంగతనం కేసు చర్చనీయాశంగా మారింది. టమోటాలు కిలో వందరూపాయలకు పైగా పలుకుతుండటంతో దొంగలు చేతివాటం చూపించారు. నాలుగు ట్రేల టమోటాలను గుర్తు తెలియని వ్యక్తులు కాజేసినట్లు పెనుగంచిప్రోలు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగుచూసింది. రేటు బాగా ఉండటంతో టమోటాలను దొంగిలించటం చర్చనీయాంశం కాగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.