World Tigers Day Celebrated In Tirupati: తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా పులుల దినోత్సవం
తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవరణలో చెట్లు నాటారు. పులుల ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. పులుల ఫోటో ఆల్బమ్, పోస్టర్ ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అవార్డులు అందించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య గతంలో కన్నా పెరిగిందన్నారు.