Suicide Attempt: రైలు కింద తలపెట్టిన వృద్ధురాలు.. నదిలో దూకిన మరో పెద్దావిడ.. రక్షించిన అధికారులు
వేర్వేరు ఘటనల్లో నెల్లూరు, తిరుపతిలో వృద్దురాళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అధికారులు వారిని ప్రాణాలతో రక్షించారు. రేణిగుంట రైల్వేస్టేషన్‌లో నిలబడి ఉన్న గూడ్స్ రైలు కింద పాండియమ్మ అనే వృద్ధురాలు తలపెట్టింది. రైతులు కదులుతుండగా చూసిన అధికారులు ఆమెను రక్షించారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరులోనూ మరో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలతో పెన్నా నదిలో దూకింది వృద్ధురాలు. దుండిగం గ్రామానికి చెందిన ఆమెగా గుర్తించారు.