Dollar Seshadri: అల వైకుంఠానికి శేషాద్రి... చివరి క్షణం వరకూ స్వామి సేవలోనే...!
42ఏళ్ళ పాటు శ్రీవారి ఆలయంలో పని చేసిన పాల శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి ఈ ఉదయం పరమపదించారు.వైజాగ్ లో కార్తీక దీపోత్సవ నిర్వహణకు వెళ్ళిన శేషాద్రి గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు.చివరి శ్వాస వరకు స్వామి సేవలో తరించాలన్న కోరికను మాత్రం శేషాద్రి నేరవేర్చుకున్నారు.స్వామి సేవలో తరిస్తూనే తుది శ్వాస విడిచారు.వేంకటాద్రిలో జన్మించి….సింహద్రిలో ప్రాణాలు విడిచిన డాల్లర్ శేషాద్రి ఆకాల మరణం పట్ల టీటీడి అధికారులతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.