Kandaleru Reservoir : కండలేరు డ్యామ్ పై ఆందోళన లో నెల్లూరు ప్రజలు
Continues below advertisement
నెల్లూరు జిల్లా రాపూరు మండలం చెల్లటూరు గ్రామంలో 1983లో కండలేరు డ్యామ్ నిర్మించారు. కండలేరు ప్రాజెక్ట్ మట్టికట్ట 11 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఇందులో 6 నుంచి 8వ కిలోమీటర్ మధ్యలో కొంతభాగం మట్టి కిందకు జారిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి బాగా వదులు కావడంతో కొంతమేర కిందకు జారింది. మట్టి కొంతభాగం కిందకు జారడంతో జనం భయపడుతున్నారు. కండలేరు డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ డ్యామ్ చుట్టూ మట్టి కట్ట ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద మట్టికట్ట ఉన్న డ్యామ్ గా కండలేరుకి పేరుంది. మిగతా ప్రాజెక్ట్ లన్నిటిలో కాంక్రీట్ తో కరకట్టలు నిర్మిస్తే.. కండలేరు విషయంలో మాత్రం అక్కడి స్థానిక పరిస్థితుల వల్ల మట్టితోనే కట్ట కట్టారు.
Continues below advertisement