Dollar Seshadri: గుండెపోటుతో డాలర్ శేషాద్రి కన్నుమూత

తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. శేషాద్రికి భార్య చంద్ర, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola