Dollar Seshadri: నిత్యం తను ధరించే డాలర్ ను పాలశేషాద్రి ఎవరికివ్వాలనుకున్నారు..?
పొడువైన చైన్ అందులో దిట్టంగా కనపడేలా ఓ డాలర్ వేసుకొని కనిపిస్తూ... పాల శేషాద్రి తన పేరును డాలర్ శేషాద్రిగా చరితార్థం చేసుకున్నారు.ఆయనకు వారసులు ఎవరూ లేకపోవడంతో తన డాలర్ చైన్ ను అత్యంత ఆప్తుడైన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికీ ఇవ్వాలనుకున్నారు డాలర్ శేషాద్రి..ఇందుకోసం ఆరు నెలలు క్రితమే డాలర్ శేషాద్రి ప్రయత్నించినా...ధర్మారెడ్డి సున్నితంగా నిరాకరించారు. డాలర్ శేషాద్రి వైకుంఠ ప్రాప్తితో వారి మధ్య బంధాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన ధర్మారెడ్డి...శేషాద్రి గృహానికి చేరుకుని డాలర్ ను ధరించారు.వారిద్దరి మధ్య వున్న బంధానికి ఇదే దర్శనమని టీటీడీ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు.