Tirumala New Prasadam: తిరుమలలో అందుబాటులోకి కొత్త ప్రసాదం.. చిల్లర కష్టాల తప్పించుకోవడానికి భలే ప్లాన్...
భక్తుల నుంచి వచ్చిన నాణేలను తిరిగి భక్తులకే ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణెలను శ్రీవారి ధనప్రసాదం పేరిట భక్తులకే తిరిగి పంపిణే చేసే వినూత్న కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణెలను 100 రూపాయలు ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్‌లలో ప్యాక్ చేసి భక్తులకు అందజేస్తోంది. భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా కాషన్ డిపాజిట్ కూడా చెల్లిస్తూ ఉండడంతో భక్తులు గదిని ఖాళీ చేసే సమయంలో కాషన్ డిపాజిట్‌ను శ్రీవారి ధనప్రసాదం రూపంలో చెల్లించేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఒక్క రూపాయి కాయిన్స్ ఇస్తుండగా, రానున్న రోజుల్లో 2,5 రూపాయలను ప్యాకెట్ లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులోకీ తీసుకురానుంది. ఒక వేళ భక్తులు చిల్లర నాణెలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్‌ను భక్తులకు టిటీడి చెల్లిస్తోంది.