TTD EO Review on Bramhotsavalu : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈవో రివ్యూ | ABP Desam

ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. సెప్టంబర్ 27వ తేదిన ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola