Tragic Accident In Srikalahasti: లారీని ఢీకొట్టిన కారు, ఆరుగురు దుర్మరణం

Continues below advertisement

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని శ్రీకాళహస్తి ఆలయ దర్శనార్థం..... కొందరు భక్తులు వెళ్తుండగా.... ప్రమాదం జరిగింది. మెట్టకండ్రిగ గ్రామం వద్ద... వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టటంతో ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని, మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీరంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. ఎదురుగా వస్తున్న లారీని గమనించకుండా..... వేరే వాహనాన్ని వేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram