Tirumala Ugra Sreenivasudi Darsanam: తిరుమలలో భక్తులకు అరుదైన దర్శనభాగ్యం
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన ఉగ్రశ్రీనివాసుడు.... మాడవవీధుల్లో విహరించారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే... కైశిక ద్వాదశి నాడే భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ వేకువజామున, సూర్యోదయం కన్నా ముందే స్వామివారి ఊరేగింపు జరిగింది. భక్తులు దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వామివారు తిరిగి ఆలయం లోనికి వెళ్లిపోయారు.