Tirumala Bramhotsavalu : శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఉదయం కల్పవృక్ష వాహనం | DNN | ABP Desam
Continues below advertisement
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్షవాహనంపై దర్శనమిచ్చారు. రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించిన స్వామి వారు భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వ జన్మస్మరణ కూడా కలుగుతుంది. అందుకే స్వామి కల్పవృక్షంపై అధిష్టులయ్యారని ప్రతీతి.
Continues below advertisement