తిరుమల శ్రీవారి దర్శనం లో పుష్ప టీం
Continues below advertisement
తిరుమల శ్రీవారిని పుష్ప మూవీ టీం దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, నటుడు సునీల్, ప్రొడ్యూసర్ నవీన్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల పుష్ప మూవీ ప్రొడ్యూసర్ నవీన్ మాట్లాడుతూ.. పుష్ప మూవీ ఘన విజయం సాధించడంతో స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు.
Continues below advertisement